జ్ఞానప్రదాయినీ..

ABN , First Publish Date - 2022-10-03T06:06:03+05:30 IST

సరస్వతీదేవి అనుగ్రహంతోనే విద్యార్థులు విజయం సాధిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

జ్ఞానప్రదాయినీ..
గుంటుపల్లిలో అక్షరాభ్యాసం చేయిస్తున్న దేవినేని ఉమా

సరస్వతీ దేవిగా అమ్మ దర్శనం

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం), అక్టోబరు 2: సరస్వతీదేవి అనుగ్రహంతోనే విద్యార్థులు విజయం సాధిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దసరా శరన్నావరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనిమిచ్చారు. గుంటుపల్లిలో కాశీ విశ్వేశ్వర విశాలాక్షి  దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులకు అక్షరభ్యాసం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూరి వెంకటకృష్ణ, నల్లూరు సూర్యనారాయణ, చెరు కూరి వెంకట్రావు, జాస్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 గొల్లపూడి : ఫ్రెండ్స్‌ యూత్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో గొల్లపూడి మైలురాయి సెంటర్‌లో  మూలానక్షత్రం సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమ పూజ చేశారు. ఆర్గనైజింగ్‌ గత కొన్నేళ్లుగా ఇక్కడ ఫ్రెండ్‌షిప్‌ సర్కిల్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. 6న అమ్మవారి విగ్రహాన్ని గ్రామోత్సవం చేస్తామన్నారు. 7న అన్నదానం నిర్వహిస్తామన్నారు.  రాయనపాడులో వేణుగోపాలస్వామి ఆలయంలో అమ్మవారిని మూలానక్షత్రం సందర్భంగా సర్పంచ్‌ కాఠంనేని కల్యాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ కాఠంనేని పూర్ణచంద్రరావు దర్శించుకున్నారు. 

తిరువూరు: అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం ఆదివారం అమ్మవార్లు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరువూరు శాంతినగర్‌ కనదుర్గ ఆలయంలో సరస్వతీదేవిగా అలంకరించారు. ఉదయం ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు, ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అర్చకులు సామూహిక అక్షరాభ్యస కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీఅష్టలక్ష్మి, గౌరికేదారేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, పీటీకొత్తూరు రామాలయంలో  సరస్వతీ దేవిగా అలంకరించి పుజలు నిర్వహించారు. 

Updated Date - 2022-10-03T06:06:03+05:30 IST