వంటలు

కొబ్బరి మిఠాయి

కొబ్బరి మిఠాయి

కావలసిన పదార్థాలు: కొబ్బరి కోరు - మూడు కప్పులు, కొబ్బరి పాలు- కప్పు, పంచదార లేదా బెల్లం- కప్పు, నెయ్యి- మూడు స్పూన్లు


తయారుచేసే విధానం: ఓ మందపాటి కడాయిలో కొబ్బరి కోరు, పాలు వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. దీనికి పంచదార, రెండు స్పూన్ల నెయ్యి వేసి దగ్గర కొచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఓ పళ్లానికి నెయ్యి పూసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరంతా దగ్గరకు రాగానే పళ్లెంలో వేయాలి. కాస్త చల్లారాక ముక్కలు కోస్తే కొబ్బరి మిఠాయి రెడీ.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.