జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదు: మంత్రి కొడాలి

Published: Fri, 25 Mar 2022 15:26:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదు: మంత్రి కొడాలి

అమరావతి: ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదన్నారు. వెన్నుపోటు రాజకీయాలు ముఖ్యమంత్రికి తెలియవన్నారు. సీఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదన్నారు. లోకేష్‌కు దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేయాలని సవాల్ చేశారు. సొంత బాబాయ్‌ వివేకను చంపాల్సిన అవసరం జగన్‌కు ఏముందని ప్రశ్నించారు. నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దన్నారు. కోర్టులపై అపారమైన గౌరవం ఉందని సీఎం జగన్‌ చెప్పారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.