చంద్రబాబువి శవ రాజకీయాలు: కొడాలి నాని

ABN , First Publish Date - 2021-08-17T22:56:59+05:30 IST

జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకే లోకేష్ డ్రామా ఆడుతున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

చంద్రబాబువి శవ రాజకీయాలు: కొడాలి నాని

అమరావతి: జగనన్నవిద్యాకానుక కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకే నారా లోకేష్ డ్రామా ఆడుతున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత మహిళ శవాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేత చంద్రబాబునాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి తట్టుకోలేకే టీడీపీ నేతలు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్‌.. సీఎం జగన్‌కు.. సవాళ్లు విసిరే స్థాయి లేదన్నారు. మహిళలపై దాడులు జరగకూడదనే దిశ చట్టం, దిశ యాప్ తీసుకువచ్చామని కొడాలి నాని తెలిపారు. 

Updated Date - 2021-08-17T22:56:59+05:30 IST