AP News: కొడాలి నాని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలి: టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-09-18T01:36:50+05:30 IST

కృష్ణాజిల్లా: పెదపారుపూడిలో టీడీపీ బీసీ నేత ఈశ్వరరావుపై దాడికి పాల్పడ్డ కొడాలి నాని పీఎ లక్ష్మోజీ, అనుచరులను అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, కాగిత కృష్ణప్రసాద్ అడిషనల్ ఎస్పీని కలిశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

AP News: కొడాలి నాని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలి: టీడీపీ నేతలు

కృష్ణాజిల్లా: పెదపారుపూడిలో టీడీపీ(TDP) బీసీ నేత ఈశ్వరరావుపై దాడికి పాల్పడ్డ కొడాలి నాని పీఎ లక్ష్మోజీ, అనుచరులను అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు దేవినేని ఉమా (Devineni Uma), కొల్లు రవీంద్ర (Kollu Ravindra), కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao), కాగిత కృష్ణప్రసాద్ అడిషనల్ ఎస్పీని కోరారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ..

‘‘పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. చట్టాన్ని రౌడీలకు అప్పగించినట్టుగా పోలీసుల తీరు ఉంది. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారు. ఈశ్వరరావును ఇంటికి పిలిచి.. మారణాయుధాలతో దాడి చేస్తే ఇప్పటి వరకు FIR నమోదు చేయని పరిస్థితి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. 


కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘అరాచక శక్తుల్ని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ నేతలపై దాడుల వైనాన్ని ఎప్పటికప్పుడు పోలీసులు దృష్టికి తీసుకెళ్తున్నా.. వారు తమకేమీ పట్టనట్లుగా వన్ సైడ్‌గా వ్యవహరించడం దారుణం. మచిలీపట్నం డీఎస్పీ వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు. ఈశ్వరరావుపై దాడి చేసిన కొడాలి నాని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలి. ’’ అని డిమాండ్ చేశారు.  


కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. నియంతృత్వ ధోరణితో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం, కేసులు పెట్టడం అనవాయితీగా మారింది. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని కోరారు. 

Updated Date - 2022-09-18T01:36:50+05:30 IST