కొడాలి నాని, రోజా మాట్లాడిన విధానం తప్పు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-11-20T21:09:30+05:30 IST

టీడీపీ అధినేద చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కొడాలి నాని, రోజా మాట్లాడిన విధానం తప్పు: జగ్గారెడ్డి

హైదరాబాద్: టీడీపీ అధినేద చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాగే చేస్తే జగన్‌కే ఏదో ఒకరోజు రివర్స్ అవుతుందని హెచ్చరించారు. జగన్‌కు సీఎం పదవి శాశ్వతం కాదని, రాజకీయాలు హుందాగా ఉండాలని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబుపై వైఎస్ మాట జారినప్పుడు విచారం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్లు వైఎస్‌ ప్రకటించారని తెలిపారు. జగన్ సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి వ్యక్తిగత దూషణలు చూడలేదని పేర్కొన్నారు. 


‘‘చంద్రబాబు సతీమణి విషయంలో తప్పుగా మాట్లాడారు. దేశ రాజకీయాల్లో కీలక చంద్రబాబు పాత్ర పోషించారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా మాట్లాడిన విధానం తప్పు. ప్రజలు ఆమోదించరు. భువనేశ్వరిని దూషించిన మాటలే.. జగన్, కొడాలి నాని, రోజాను అంటే ఎలా ఉంటుంది?. చోద్యం చూసిన తమ్మినేని సీతారాం.. స్పీకర్ పదవికి అనర్హుడు. మంత్రులు కొడాలి నాని, అనిల్ దంగల్‌లో దిగినట్లు ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ ఘటనపై తప్పు జరిగిందని జగన్‌ వివరణ ఇవ్వాలి. ఇలాంటి సంప్రదాయాలకు జగన్ ఫుల్‌స్టాప్ పెట్టాలి’’ అని జగ్గారెడ్డి సూచించారు.

Updated Date - 2021-11-20T21:09:30+05:30 IST