రామజన్మభూమి పరిసరాల్లో కోదండరాముని కొలువు!

ABN , First Publish Date - 2021-04-17T13:02:15+05:30 IST

యూపీలోని అయోధ్య రామజన్మభూమి పరిసరాల్లో...

రామజన్మభూమి పరిసరాల్లో కోదండరాముని కొలువు!

అయోధ్య: యూపీలోని అయోధ్య రామజన్మభూమి పరిసరాల్లో కోదండరాముడు కొలువుదీరబోతున్నాడు. మెటల్ కోటెడ్‌గా రూపొందించిన ఈ విగ్రహాన్ని అయోధ్య పరిసరాల్లో నెలకొల్పనున్నారు. ఈ విగ్రహాన్ని గ్వాలియర్‌కు చెందిన రామభక్తుడొకరు తయారుచేయించి, శ్రీరామ జన్మభూమి తీర్థట్రస్ట్‌కు అప్పగించారు. రామజన్మభూమిలో ప్రధాన ఆలయంతో పాటు గ్రహనక్షత్ర వాటిక, శ్రీరాముని చరిత్రను తెలిపే విగ్రహాలు, శ్రీరామ గుహ, శివుడు, హనుమంతుని ఆలయాలు నిర్మితం కానున్నాయి. కాగా రామజన్మభూమిలో ఏర్పాటు చేయబోయే ఈ కోదండరాముని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ కానుంది.



Updated Date - 2021-04-17T13:02:15+05:30 IST