ఆరేళ్లలో ఒరిగిందేమి లేదు..

ABN , First Publish Date - 2021-03-06T05:14:12+05:30 IST

ఆరేళ్లలో ఒరిగిందేమి లేదు..

ఆరేళ్లలో ఒరిగిందేమి లేదు..
రైతు సభలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

టీజేఎస్‌ చైర్మన్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం

నర్సంపేట టౌన్‌, మార్చి 5 : కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో రైతును కీల్చుబొమ్మగా మార్చేందుకే కేంద్రం ఇటీవల సాగు చట్టాలను తీసుకొచ్చిందని, హరితహారం పేరు తో పోడు భూములను  ప్రభుత్వం ఆక్రమించుకునేందుకు యత్నిస్తోందని టీజేఎస్‌ చైర్మన్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం ధ్వజమెత్తారు. శుక్రవారం నర్సంపేట సిటీజన్స్‌ క్లబ్‌లో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎం ఎస్‌) ఆధ్వర్యంలో రైతు సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోదండరాం మాట్లాడుతూ  ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజ లు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలను మొదట వ్యతిరేకించిన కేసీఆర్‌, ఢిల్లీకి వెళ్లొచ్చాక మాట మార్చడం సరైంది కాదన్నారు. విద్యు త్‌ సవరణ బిల్లుతో మోటార్లకు మీటర్లు వచ్చే  ప్రమాదముందన్నారు. 

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రైతుల మెడకు ఉరి తాళ్లుగా మారాయని, వాటిని తక్షణమే రద్దు చేయా లన్నారు. సభలో టీజేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు చిన్న చంద్రన్న, పరికిరత్నం, లావుడ్య రాజు, చిర్ర  సూరి, గూబ రాజు, అడ్డూరి రాజు, మడ అశోక్‌, నర్సింహారావు, గూబ తిరుపతమ్మ, పసునూరి రాజు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన : కోదండరాం

నల్లబెల్లి: పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని టీజే ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. శుక్రవారం రుద్రగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోయిందన్నారు. నాలుగేళ్ల నుంచి కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధుల్లో 50శాతం కూడా ఖర్చు చేయకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో టీజేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌, నాయకులు బొట్ల పవన్‌, మామిండ్ల చిన్నఐలయ్య, కుమారస్వామి, మేఘం తదితర నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-06T05:14:12+05:30 IST