సింగరేణిని కాపాడుకుందాం..

ABN , First Publish Date - 2021-03-06T05:34:47+05:30 IST

సింగరేణిని కాపాడుకుందాం..

సింగరేణిని కాపాడుకుందాం..

తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం


కాకతీయఖని, మార్చి 5 : తెలంగాణకే తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకుందామని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాకు వచ్చిన సందర్భంగా అంబేద్కర్‌, జయశంకర్‌ సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఎమ్మెల్సీ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు చేసిన ఉద్యమాలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందన్నారు. ఏటేటా బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పెంచుకుంటూ.. పోతున్న సింగరేణి యాజమాన్యం కార్మికుల సంఖ్యను మాత్రం పెంచకుండా.. అలాగే ఉంచుతోందని విమర్శలు చేశారు. ఓపెన్‌ కాస్టులకు వ్యతిరేకంగా పోరాడిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేడు అవే ఓసీలను దర్జాగా ఓపెన్‌ చేస్తోందని మండిపడ్డారు. దీంతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అండర్‌గ్రౌండ్‌ గనులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 సింగరేణిలో పేరు మార్పిడికి చాలామంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెర గట్టయ్య, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్‌, నాయకులు గొడిసెల శ్రీహరి, దేవి సత్యం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ముకిరాల జనార్ధన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:34:47+05:30 IST