వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కోదండరాం కామెంట్స్

ABN , First Publish Date - 2021-01-24T21:06:41+05:30 IST

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కోదండరాం కామెంట్స్

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కోదండరాం కామెంట్స్

హైదరాబాద్: వైఎస్ షర్మిల కొత్త పార్టీపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. పక్క రాష్ట్రం వాళ్లు పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ ఉండదని కోదండరాం స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణలో  ప్రేమాభిమానాలు ఉన్న మాట వాస్తవమని, వైఎస్ఆర్‌పై ఉన్న సానుభూతి మాత్రమే పార్టీని నడపడానికి సరిపోవని ఆయన అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చటానికి ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని కోదండరాం వెల్లడించారు. అయితే అది స్వరాష్ట్రం వాళ్లతోనే సాధ్యమన్నారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని గతంలో తెలంగాణ ప్రజలు ప్రతిఘటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. జగన్, విజయలక్ష్మి, షర్మిలను  తెలంగాణ ప్రజలు ఘెరావ్ చేశారని కోదండరాం గుర్తు చేశారు.


తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదని, టీఆర్ఎస్‌ను వీడాలనుకుంటోన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికే కేసీఆర్ మైండ్ గేమ్ విధానాలను కాకుండా.‌. ప్రతిపక్షాలు తనను టార్గెట్ చేయటంతో కేసీఆర్ ఎదుర్కోలేకపోతున్నాడని కోదండరాం విమర్శించారు. కేసీఆర్ తప్పుకుని ఇప్పటికైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేసి మాట నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా 26న ఇందిరాపార్క్ వద్ద వాహనాల ర్యాలీ నిర్వహిస్తామని కోదండరాం పేర్కొన్నారు.


Updated Date - 2021-01-24T21:06:41+05:30 IST