పలమనేరులో ఘనంగా మైలేరు పండుగ

ABN , First Publish Date - 2021-03-03T06:11:29+05:30 IST

పలమనేరు మండలం కొలమాసనపల్లెలో మంగళవారం మైలేరు పండుగను ఘనంగా నిర్వహించారు. అరిమాను గంగమ్మజాతరలో భాగంగా సాంప్రదాయం ప్రకారం మైలేరు పండుగను నిర్వహించారు.

పలమనేరులో ఘనంగా మైలేరు పండుగ
గిత్తను నిలువరిస్తున్న యువకులు

పలమనేరు రూరల్‌,మార్చి 2 : పలమనేరు మండలం కొలమాసనపల్లెలో మంగళవారం మైలేరు పండుగను ఘనంగా నిర్వహించారు. అరిమాను గంగమ్మజాతరలో భాగంగా సాంప్రదాయం ప్రకారం మైలేరు పండుగను నిర్వహించారు.  మైలేరు లో ఫ్రైజ్‌మనీ భారీగా ఉండడం, రాయలసీమలోనే మొట్టమొదటి మైలేరు పండుగ కావడంతో జిల్లాతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి గిత్తలతో పాటు జనం భారీగా తరలివచ్చారు. దీంతో కొలమాసనపల్లె గ్రామమంతా జనసంద్రమైంది. ఉరకులేస్తూ పరుగెడుతున్న మైలేరు గిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు.  ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ మైలేరులో గంగవరంకు చెందిన ముత్యాలమ్మ అనే గిత్త ప్రథమస్థానంలో నిలచి రూ.55,555 నగదు బహుమతి గెలుచుకొంది. అలాగే రెండవ, మూడవ బహుమతిగా తమిళనాడుకు చెందిన గిత్తలకు రూ.44,444, రూ.33,333 నగదు బహుమతులను అందజేశారు.  సరైన బారికేడ్లు నిర్మించకపోవడంతో పరుగెడుతున్న గిత్తలు మధ్యలోనే జనాల్లోకి పలుసార్లు దూసుకు పోవడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం కలగకపోవడంతో ఇటు పోలీసులు, అటు నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు.


Updated Date - 2021-03-03T06:11:29+05:30 IST