బీరువాలో కోడెనాగు

ABN , First Publish Date - 2022-01-18T04:49:43+05:30 IST

పండుగ పూట ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. మండల కేంద్రానికి చెందిన ఈశ్వరమ్మ ఇంట్లోని బీరువాలో కోడె నాగుపాము దూరింది.

బీరువాలో కోడెనాగు
కోడె నాగు పామును పట్టుకుంటున్న కృష్ణసాగర్‌

- పండుగ పూట తప్పిన  ప్రాణాపాయం 

-  అడవిలో వదిలేసిన కృష్ణసాగర్‌ 

గోపాల్‌పేట, జనవరి 17 : పండుగ పూట ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. మండల కేంద్రానికి చెందిన ఈశ్వరమ్మ ఇంట్లోని బీరువాలో కోడె నాగుపాము దూరింది.  రాత్రి నుంచి బీరువాలో శబ్ధం వస్తుండటంతో ఉదయం చూద్దాం అనుకున్నది. కానీ తెల్లవారుజామున మళ్లీ శబ్ధం రావడంతో  ఈశ్వరమ్మ బీరువా తెరిచే సరికి నాగుపాము  బుసలు కొడుతూ కనిపించింది. ఆమె వెంటనే బీరువాను మూసివేసింది. దీంతో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ శ్వరమ్మ ఆమె  తమ్ముడికి ఫోన్‌ చేయడంతో అతను హోంగార్డు కృష్ణసాగర్‌కు సమాచారం ఇచ్చారు. వనపర్తి నుంచి వచ్చిన  కృష్ణ సాగర్‌  ఆ పామును పట్టుకొని అడవిలో వదిలేశాడు.  

Updated Date - 2022-01-18T04:49:43+05:30 IST