కోహ్లీకి అద్భుతమైన జట్టుంది.. మాజీ కోచ్ కామెంట్స్!

ABN , First Publish Date - 2020-07-14T03:12:46+05:30 IST

టీమిండియా సారధి కోహ్లీకి అద్భుతమైన జట్టుందని భారత జట్టు మాజీ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ పేర్కొన్నారు.

కోహ్లీకి అద్భుతమైన జట్టుంది.. మాజీ కోచ్ కామెంట్స్!

బెంగళూరు: టీమిండియా సారధి కోహ్లీకి అద్భుతమైన జట్టుందని భారత జట్టు మాజీ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ పేర్కొన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పుడున్న జట్టే అత్యుత్తమమైందని అన్షుమాన్ తెలిపారు. ‘బౌలింగ్, బ్యాటింగ్‌తో భారత జట్టులో సమతూకం అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకూ జట్టులో మంచి పేసర్ల కొరత ఉండేది. కానీ ఇప్పుడు మనకు అద్భుతమైన పేస్ దళం ఉంది. ఈ పేసర్లలో ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీరంతా మ్యాచులు గెలిపించగల సత్తా ఉన్న వాళ్లే’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ భారత జట్టు కోహ్లీ సారధ్యంలో 89 వన్డేలు, 55 టెస్టులు, 37 టీ20లు ఆడింది.

Updated Date - 2020-07-14T03:12:46+05:30 IST