బహుశా కోహ్లీనే అత్యుత్తమ వన్డే ప్లేయర్: ఆసీస్ సారథి ఫించ్

ABN , First Publish Date - 2020-11-26T22:42:15+05:30 IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా సారథి అరోన్ ఫించ్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై

బహుశా కోహ్లీనే అత్యుత్తమ వన్డే ప్లేయర్: ఆసీస్ సారథి ఫించ్

సిడ్నీ: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా సారథి అరోన్ ఫించ్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. వన్డేల్లో బహుశా కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. అతడి రికార్డులే ఈ విషయాన్ని చెబుతాయన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు సిడ్నీలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఫించ్ మాట్లాడుతూ.. ఇది నిజంగా చాలా గొప్ప విషయమని, అతడిని (కోహ్లీ)ని త్వరగా అవుట్ చేయడంపైనే తాము దృష్టిసారించాల్సి ఉంటుందని అన్నాడు.  


ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతనిధ్యం వహించిన ఫించ్.. కోహ్లీతో కలిసి రెండు నెలలుపాటు గడిపినప్పటికీ అతడిలో ఎటువంటి బలహీనతను గుర్తించలేకపోయాడు. ‘‘అతడు బహుశా వన్డేల్లో ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాడు. కాబట్టి మేం మా ప్రణాళికకు కట్టుబడి ఉండాలి’’ అని ఫించ్ వివరించాడు.   

Updated Date - 2020-11-26T22:42:15+05:30 IST