
ముంబై: విరాట్ కోహ్లీయే అత్యుత్తమ టెస్టు బ్యాటరని షేన్ వాట్సన్ కితాబిచ్చాడు. ఆధునిక క్రికెట్‌లో ఐదుగురు ఉత్తమ ఆటగాళ్లను అతడు ఎంపిక చేశాడు. 2019 నుంచి కోహ్లీ ఇప్పటిదాకా ఏ ఫార్మాట్‌లోనూ శతకం నమోదు చేయనప్పటికీ ఆసీస్ మాజీ ఆటగాడు వాట్సన్ మాత్రం కోహ్లీనే బెస్ట్ అని తేల్చాడు. టెస్టుల్లో అతడి ఘనతలను చూస్తే సూపర్ హ్యూమన్ అని పిలవచ్చని వాట్సన్ అన్నాడు. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీ పదో స్థానంలో ఉన్నాడు. కనీసం 40 టెస్టుల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో ప్రస్తుతం టెస్టుల్లో టాపర్‌గా ఉన్న లబుషేన్ (26 మ్యాచ్‌లు)ను అతడు ఎంపిక చేయలేదు.