Advertisement

ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు..

Apr 22 2021 @ 22:41PM

ముంబై: ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డునందుకున్నాడు. ఐపీఎల్‌లో 6000వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో బెంగళూరు విజయానికి అతి చేరువలో ఉంది. 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 150 పరుగులు పూర్తి చేసిన బెంగళూరు మరో 28 పరుగులు చేస్తే విజయం దక్కించుకుంటుంది. కాగా.. విరాట్ కోహ్లీ తరువాత సురేశ్ రైనా 197 ఇన్నింగ్స్‌లో 5,448 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత మూడో స్థానంలో శిఖర్ ధవన్ 180 మ్యాచ్‌లలో 5,428 రన్స్ చేశాడు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.