ఓపెనర్‌గా వచ్చినా మారని రాత.. 9 పరుగులకే వెనుదిరిగిన కోహ్లీ

Published: Tue, 26 Apr 2022 21:45:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఓపెనర్‌గా వచ్చినా మారని రాత.. 9 పరుగులకే వెనుదిరిగిన కోహ్లీ

పూణె: పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ మరోమారు దారుణంగా విఫలమయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చినా ఫలితం లేకుండా పోయింది. 10 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ్ కృష్ణ చేతిలో అవుటయ్యాడు. అవుట్ తర్వాత నిరాశగా వెనుదిరిగాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.