బెంగాల్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా

Published: Thu, 06 Jan 2022 15:45:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బెంగాల్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా

కరోనా ఉధృతి తగ్గిందనుకున్న ప్రతిసారి మరో కొత్త వేరియంట్‌తో కలకలం సృష్టిస్తోంది కరోనా. ఇటీవల కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ జనాల్లో కలవరం కలిగిస్తోంది. దీంతో  దేశవ్యాప్తంగా జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలను వాయిదా వేస్తున్నాయి యాజమాన్యాలు. 


తాజాగా బెంగాల్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోల్‌కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ని వాయిదా వేసింది. నిజానికి ఒకరోజు క్రితమే 50 శాతం హజరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించగా.. మరుసటి రోజే పూర్తిగా నిలిపివేసి వాయిదా వేసింది యాజమాన్యం.


ముఖ్యంగా మంగళవారమే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఛైర్ పర్సన్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఏ రాజ్ చక్రబర్తి, ఆయన భార్య సుభాశ్రీ గంగూలీకి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. దీంతో.. ‘రాష్ట్రంలోని ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని అంచనా వేసిన తర్వాత సినీ లవర్స్, పౌరులు కోవిడ్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.  అంతేకాకుండా ఇప్పటికే ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీకి దగ్గరగా ఉండే సినీ ప్రముఖులు దీని బారిన పడ్డారు. అందుకే అందరి భద్రతను పరిగణలోకి తీసుకొని జనవరి 7-14, 2022 మధ్య జరగాల్సిన 27వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని కమిటీ నిర్ణయించింద’ని ఓ స్టేట్‌మేంట్‌ని విడుదల చేసింది కమిటీ.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest News in Teluguమరిన్ని...