IPL 2022: హైదరాబాద్‌పై టాస్ గెలిచిన KKR

ABN , First Publish Date - 2022-05-15T00:42:59+05:30 IST

సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2022: హైదరాబాద్‌పై టాస్ గెలిచిన KKR

పూణె: సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు పదేసి పాయింట్లతో ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతాకు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోగా, హైదరాబాద్‌కు మాత్రం మిణుకుమిణుకు మంటున్నాయి. ఈ మ్యాచ్‌తో పాటు మిగతా రెండు లీగు మ్యాచుల్లోనూ భారీ విజయాలు సాధిస్తే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో విలియమ్సన్ సేన విజయమే లక్ష్యంగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

Read more