
ముంబై: పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. పంజాబ్ మాత్రం ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఊపుమీదుంది.
ఇరు జట్లలోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పగల బౌలర్లు, బ్యాటర్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. పంజాబ్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. సందీప్ స్థానంలో రబడ వచ్చి చేరాడు. గత మ్యాచ్‌లో సందీప్ బౌలింగ్ బాగానే చేసినప్పటికీ ఈ మ్యాచ్‌లో రబడకు తుది జట్టులో స్థానం కల్పించినట్టు మాయంక్ చెప్పుకొచ్చాడు. కోల్‌కతా కూడా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. షెల్డన్ జాక్సన్ స్థానంలో శివమ్ మావీకి తుది జట్టులో స్థానం కల్పించింది.
ఇవి కూడా చదవండి