టాస్ గెలిచిన కోల్‌కతా.. రాయల్స్ బ్యాటింగ్

ABN , First Publish Date - 2022-04-19T00:43:10+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్

టాస్ గెలిచిన కోల్‌కతా.. రాయల్స్ బ్యాటింగ్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ప్రత్యర్థి రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కేకేఆర్ తుది జట్టులో శివమ్ మావి చోటు దక్కించుకోగా, అమన్ ఖాన్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. డుసెన్, కుల్దీప్, నీషమ్ బెంచ్‌కు పరిమితం కాగా, కరుణ్ నాయర్, మెక్‌కాయ్, ట్రెంట్‌బౌల్ట్ జట్టులోకి వచ్చారు.


రాజస్థాన్ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు, ఆరు పాయింట్లతో ఐదు స్థానంలో ఉండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో విజయం సాధించి ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

Updated Date - 2022-04-19T00:43:10+05:30 IST