‘మీ సలహాదారులలో ఎంతమంది బీసీలు ఉన్నారు?’

ABN , First Publish Date - 2021-11-24T23:59:32+05:30 IST

దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని అనేక సందర్భాల్లో చర్చించడం జరిగిందని, టీడీపీ హయాంలోనే దీనిపై తీర్మానం చేసి పంపించామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

‘మీ సలహాదారులలో ఎంతమంది బీసీలు ఉన్నారు?’

విజయవాడ: దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని అనేక సందర్భాల్లో చర్చించడం జరిగిందని, టీడీపీ హయాంలోనే దీనిపై తీర్మానం చేసి పంపించామని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్మోహన్ రెడ్డి  బీసీలను ఉద్ధరించేలా మాట్లాడుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారి నాయకత్వంలో బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో స్ధానిక సంస్ధల్లో 34 శాతం రిజర్వేషన్లు సాధిస్తే ఇప్పుడు 24 శాతంకు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. బీసీల విషయంపై కేంద్రంతో ఒక్కసారి అయినా మాట్లాడారా అని ప్రశ్నినిస్తున్న... మీరు నామినేటెడ్ పోస్టులో బీసీలకు ఇచ్చామని చెబుతున్నారని మండిపడ్డారు.  మీరు ఎటువంటి ప్రాధాన్యత కలిగే పోస్టులను ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. మీ సలహాదారులలో ఎంతమంది బీసీలు ఉన్నారు.. నిధులు లేని 56 బీసీ కార్పోరేషన్‌లు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2021-11-24T23:59:32+05:30 IST