వైసీపీ ప్లీనరీలు సొంత డబ్బాకే!

ABN , First Publish Date - 2022-07-02T07:00:17+05:30 IST

అవినీతి ఆ రోపణల్లో చిక్కుకున్న మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తమ అక్రమ సంపాదన కాపాడుకునేందుకే రాజకీయ వారసత్వాల గురించి మా ట్లాడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

వైసీపీ ప్లీనరీలు సొంత డబ్బాకే!

పేర్ని, కొడాలి అవినీతిపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, జూలై 1 : అవినీతి ఆ రోపణల్లో చిక్కుకున్న మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తమ అక్రమ సంపాదన కాపాడుకునేందుకే రాజకీయ వారసత్వాల గురించి మా ట్లాడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మ చిలీపట్నం అసెంబ్లీ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు పేర్ని నాని, కొడాలి నాని అడ్డగోలుగా అవినీతి ఊ బిలో కూరుకుపోయారన్నారు. గడప గడపకు వెళ్లి న వైసీపీ నేతలను ప్రజలు తరిమికొట్టారని, బస్సు యాత్ర విఫలమైందని, దీంతో ప్లీనరీలతో సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రతిపక్ష నేతలను నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ప్రజల్లోని వ్య తిరేకతపై దృష్టి మరల్చేందుకు చీప్‌ట్రిక్స్‌ ఉపయోగిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీతో ఎమ్మెల్యే అయిన కొడాలి నాని ఇప్పుడు టీడీపీని విమర్శించే హక్కు లేదన్నారు. పోతేపల్లి, పొట్లపాలెం ప్రాంతా ల్లో పేర్ని నాని అనుచరులు వందలాది ఎకరాల్లో మట్టి తవ్వకాలు చేస్తున్నారని, గిడ్డంగులు నిర్మించుకున్నారన్నారు. నేషనల్‌ కాలేజీ దగ్గర స్థలాలు కబ్జా చేసి మంగలేరు శివారులో అక్రమంగా మ ట్టిని తవ్వించి కోట్లాది రూపాయల మట్టి, ఇసుక వ్యాపారం చేస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రా నైట్స్‌, ఆదిలాబాద్‌లో భూముల కొనుగోళ్లు, శ్రీకాకుళంలో ఐరన్‌ ఓర్‌లు, కొల్లేరు అభయారణ్యం భూ ములు పేర్ని నాని అనుయాయులు కైవసం చేసుకోలేదా అని ప్రశ్నించారు. గ్రీన్‌కో ట్రాన్స్‌పోర్ట్‌లో వా టాలు, బియ్యం పంపిణీ వాహనాల్లో కమిషన్లు మాజీ మంత్రులు తీసుకున్న సంగతి అందరికీ తె లుసన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి జగన్‌రెడ్డి బ యటకు రాకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేశారన్నారు. టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తె లుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, టీడీ పీ మాజీ ఫ్లోర్‌లీడర్‌ పల్లపాటి సుబ్రహ్మణ్యం మా ట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గుడివాడ, మచిలీపట్నంలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, రూరల్‌ అ ధ్యక్షుడు కుంచే నాని, బందరు టౌన్‌ అధ్యక్షుడు ఇ లియాస్‌ పాషా, కార్యదర్శి పిప్పళ్ల వెంకన్న, నేతలు మరకాని పరబ్ర హ్మం, వంకా వెంకటేశ్వరరావు, సులేమాన్‌, వాలిశెట్టి తిరుమలరావు, బొడ్డు నాగరా జు, యువరాజు, తలారి రాంబాబు, లంకే హరికృ ష్ణ, కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, సుధాకర్‌, అనిత, అన్నం ఆనంద్‌, నాగరాము పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T07:00:17+05:30 IST