దర్శకుల సంఘ ఎన్నికలు మరోమారు వాయిదా

Published: Fri, 21 Jan 2022 20:40:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దర్శకుల సంఘ ఎన్నికలు మరోమారు వాయిదా

తమిళనాడు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు మరోమారు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ నెల 23వ తేదీ ఆదివారం జరగాల్సిన ఈ ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో సీనియర్‌ దర్శకులు కె. భాగ్యరాజ్‌, ఆర్‌.కె. సెల్వమణి సారథ్యంలోని ప్యానల్స్‌ పోటీ పడుతున్నాయి. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తుంది. ఈ కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేశారు. 


ఇదే విషయంపై తమిళనాడు దర్శకుల ఎన్నికల సంఘం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన దర్శకుల సంఘం ఎన్నికలను 25వ తేదీ మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది అని పేర్కొంది. కాగా, ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇరు ప్యానెళ్ళకు చెందిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International