మాధవన్‌కు అక్కడ మార్కెట్‌ తగ్గిపోయిందా?

Jun 3 2021 @ 21:26PM

20 యేళ్ల క్రితం దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘అలైపాయుదే’ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మాధవన్‌. ఆ తర్వాత ఆయన పదికిపైగా చిత్రాల్లో నటించి, ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌తో పాటు మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. అయితే, ఆయన హిందీలో నటించాలని ఆశపడటంతో తమిళపరిశ్రమకు దూరమయ్యారు. అయితే, ఆయన మళ్లీ 2012లో ‘వేట్టై’ చిత్రంలో కనిపించారు. పిమ్మట నాలుగేళ్ళ తర్వాత ‘ఇరుది చుట్రు’ అనే చిత్రంలో నటించారు. ఆ మరుసటి సంవత్సరం ‘విక్రమ్‌ వేదా’లో నటించారు. ఈ చిత్రంలో మాధవన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే, చిత్రం కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్ళు సాధించింది. మరో మూడేళ్ళ గ్యాప్‌ తర్వాత ‘సైలెన్స్‌’, ‘మారా’ అనే చిత్రాల్లో నటించగా అవి ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ రెండూ మాధవన్‌ను తీవ్ర నిరాశకు లోను చేశాయి. 


ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో ‘రాకెట్రీ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మాధవన్‌కు కోలీవుడ్ మార్కెట్‌ తగ్గిపోయిన క్రమంలో.. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అక్కడ అందుకుంటుందో అని అంతా వేచిచూస్తున్నారు. ఈనెల ఒకటో తేదీన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న మాధవన్‌... కోలీవుడ్‌ ద్వారా నటుడుగా గుర్తింపు పొంది, ఇప్పుడా పరిశ్రమకు దూరం కావడాన్ని ఆయన అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.