రెండో పెళ్లి చేసుకున్న Kollywood స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

Published: Sun, 15 May 2022 15:10:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రెండో పెళ్లి చేసుకున్న Kollywood స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ (D. Imman). కోలీవుడ్‌ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. అతడు కంప్యూటర్ ఇంజినీర్ అయిన మోనికా రిచర్డ్స్‌ను (Monica Richards) 2008లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ, ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు 2021, డిసెంబర్ 29న ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా అప్పట్లోనే ఇమ్మాన్ ఓ మెసేజ్‌ను తన అభిమానులతో పంచుకున్నాడు. జీవితంలో మరో అడుగు ముందుకు వేయడానికీ సిద్దంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. వితంతువు, విడాకులు తీసుకున్న మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు తెలిపాడు. దీంతో అతడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు పుకార్లు షికార్లు కొట్టాయి. ఆ వదంతులను నిజం చేస్తూ అతడు మే 15న రెండో పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  


ఇమ్మాన్ రెండో భార్య పేరు అమేలీ (Amelie) అని తెలుస్తోంది. ఆమె కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ (Ubald) కూతురని సమాచారం. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. గతేడాది విడాకులు తీసుకునే ముందు ఇమ్మాన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా శ్రేయస్సును కోరేవారు, నా సంగీతాన్ని ఇష్టపడేవారు ఎంతోకాలంగా నాకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను. జీవితం మనల్ని వేర్వేరు దారుల్లో తీసుకువెళుతుంది. నేను, మోనిక 2020, నవంబర్‌లో ఒకరి అంగీకారంతో మరొకరం విడాకులు తీసుకున్నాం. మేం భార్య, భర్తలుగా ఏ మాత్రం ఉండలేం. మాకు ప్రైవసీ ఇవ్వాలని, జీవితంలో ముందుకు వెళ్లేందుకు సహాయపడాలని మీడియాను కోరుతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు’’ అని అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పెద్దన్న’ (Peddanna), అజిత్ నటించిన ‘విశ్వాసం’(Viswasam), సూర్య ‘ఎవరికీ తలవంచకు’ సినిమాలకు ఇమ్మాన్ సంగీతం అందించాడు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest News in Teluguమరిన్ని...