కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టు

ABN , First Publish Date - 2021-07-28T18:52:50+05:30 IST

మునుగోడు వెళుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టు

నల్లగొండ: మునుగోడు వెళుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మునుగోడు హెడ్ క్వార్టర్స్‌లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి వచ్చారు. అయితే మంత్రి కాన్వాయ్‌ను రాజగోపాల్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. గత సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రొటోకాల్ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ మధ్య వివాదం జరిగింది. మునుగోడు నియోజక వర్గానికి వస్తే అడ్డుకుంటామన్నారు. దీనిపై మంత్రి ప్రతి సవాల్ విసిరారు. మునుగోడు నియోజకవర్గానికి వస్తానని, అన్ని గ్రామాలు తిరుగుతానని అన్నారు. ఇవాళ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం మంత్రి మునుగోడు వచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బెంగళూర్ టోల్ ప్లాజా వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్భందాలు చేయడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదని.. త్వరలో తామేంటో చూపిస్తామన్నారు.

Updated Date - 2021-07-28T18:52:50+05:30 IST