ఆహ్వానించకుండా అవమానించారు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Published: Mon, 28 Mar 2022 19:37:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆహ్వానించకుండా అవమానించారు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ: యాదాద్రి క్షేత్రం పునః ప్రారంభానికి తనను ఆహ్వానించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవమానించారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎంపీని అయిన తనను కనీసం గౌరవించకుండా కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తనను ఆహ్వానించాలని దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ఆ కార్యక్రమానికి హాజరైతే స్థానిక ప్రజల సమస్యలు, ఇళ్లు, భూములు కోల్పోయిన వారి ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని గ్రహించి ఇలా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఆలయ నిర్మాణానికి రూ.1000కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటి నుంచో, ఫాంహౌస్‌ నుంచో ఇవ్వలేదన్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమంలా నిర్వహించుకున్నారని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వెంకట్‌రెడ్డి తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.