సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కొమురం భీమ్ ..!

Apr 23 2021 @ 08:28AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా జీవిస్తాడనడానికి ఆయన ఇప్పటి వరకు నటించిన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. నటనలోనే కాదు డాన్స్ పరంగా.. పవర్‌ఫుల్‌గా డైలాగ్స్ చెప్పడంలోనూ తారక్ శైలి మరెవరికీ లేదు.. రాదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్.. కొమురం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్‌'లో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్‌గా సౌత్ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్ సహా పలువురు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. 

 

అయితే ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొమురం భీమ్ టీజర్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 'ఆర్ఆర్ఆర్' నుంచి 2020 అక్టోబర్ 22న విడుదలయిన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 50+ వ్యూస్ మార్క్ అందుకున్న మొట్ట మొదటి టీజర్‌గా కొమురం భీమ్ ఇంట్రో వీడియో రికార్డ్ క్రియేట్ చేయడం గొప్ప విశేషం. అంతేకాదు ఈ వీడియోకు 1.3M పైగా లైక్స్.. అలాగే 1.4M కామెంట్స్ రావడం విశేషం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో  '#GonduBebbuliNTRHits50M' హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.