Komurambhim Projectను వెంటాడుతున్న ముప్పు

ABN , First Publish Date - 2022-08-08T16:07:32+05:30 IST

జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్ట్‌ను ముప్పు వెంటాడుతోంది. భారీ వర్షాల కారణంగా ఆనకట్టకు పగుళ్లు ఏర్పడ్డాయి.

Komurambhim Projectను వెంటాడుతున్న ముప్పు

కొమురంభీం: జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్ట్‌ (Komurambhim Project)ను ముప్పు వెంటాడుతోంది. భారీ వర్షాల కారణంగా ఆనకట్ట (Dam)కు పగుళ్లు ఏర్పడ్డాయి. అటు ఫారా ఫిట్ వాల్ (Fara Fit Wall) దెబ్బతినడంతో నీరు లీకవుతోంది. వరద ఉధృతికి  ఆనకట్ట కోతకు గురవుతోంది. నీటిలోకి బండ రాళ్లు జారిపడుతున్నాయి. ప్రాజెక్ట్‌కు ముప్పు పొంచి ఉండటంతో దిగువ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.  

Updated Date - 2022-08-08T16:07:32+05:30 IST