‘ఇటువంటి ఘటనలు ఎదురైతే చంద్రబాబు వెంటనే స్పందించేవారు’

ABN , First Publish Date - 2022-07-05T22:56:27+05:30 IST

సముద్రంలో వేటకి వెళ్లిన నలుగురు మత్సత్యకారులు గల్లంతయినా ప్రభుత్వం స్పందంచకపోవడం దారుణమని టీడీపీ నేత కొనకళ్ల నారాయణరావు అన్నారు.

‘ఇటువంటి ఘటనలు ఎదురైతే చంద్రబాబు వెంటనే స్పందించేవారు’

కృష్ణా: సముద్రంలో వేటకి వెళ్లిన నలుగురు మత్సత్యకారులు గల్లంతయినా ప్రభుత్వం స్పందంచకపోవడం దారుణమని టీడీపీ నేత కొనకళ్ల నారాయణరావు అన్నారు. కోస్ట్ గార్డ్స్ పడవలు కూడా పంపిచలేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అర్దమవుతుందన్నారు. వారి ఆచూకీ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో ఇటువంటి ఘటనలు ఎదురైతే చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. వారి ఆచూకీ కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. సీఎం జగన్ స్పందించి అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ యంత్రాగాన్ని ఆదేశించాలని సూచించారు.  మచిలీపట్నం మండలం క్యాంబెల్‌పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మత్స్యకారుల కుటుంబాలను టీడీపీ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

Updated Date - 2022-07-05T22:56:27+05:30 IST