విశేషాలంకరణలో శ్రీవార్లు
పోటెత్తిన భక్తులు
పెంచలకోనలో బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే ఐదవ శనివారం, వేసవి సెలవులు చివరి దశకు రావడంతో పెద్ద సంఖ్యలో శుక్రవారం రాత్రే భక్తులు కోనకు చేరుకుని, నిద్రించి మొక్కలు తీర్చుకున్నారు. తెల్లవారుజామున శ్రీవార్లకు అభిషేకాలు, ఉదయం కల్యాణం, సాయంత్రం తిరుచ్చి, ఊంజల్‌సేవ కార్యక్రమాలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.భక్తులకు ఉచిత ప్రసాదాలతో పాటు అన్నప్రసాదం అందించినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. కుల సత్రాల్లో కూడా అన్నదానం చేశారు.
- రాపూరు
క్యూలైన్లో భక్తులు