Godavariలో కొట్టుకుపోయిన 15 మంది పాడి Farmers..

ABN , First Publish Date - 2022-07-12T21:58:07+05:30 IST

కోనసీమ (Konaseema) జిల్లా: ఐనవెల్లి మండలం, ఎలకలంక గ్రామంలో పెను ప్రమాదం తప్పింది.

Godavariలో కొట్టుకుపోయిన 15 మంది పాడి Farmers..

కోనసీమ (Konaseema) జిల్లా: ఐనవెల్లి మండలం, ఎలకలంక గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. ఎలకలంక గ్రామానికి చెందిన 15 మంది రైతులు (Farmers) లంకలో ఉండే పశువులను ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజక్షన్ పడవ (boat)పై వెళ్లారు. పశువులను తీసుకువస్తున్న సమయంలో గోదావరి (Godavari) ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో పడవ మధ్యలోనే ఆగిపోయింది. గోదావరి ఉధృతికి ఏడు కి.మీ. కొట్టుకుపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో కోటిపల్లి దగ్గర అధికారులు ఇంజన్ బోట్ల సాయంతో రైతులను కాపాడారు.


యానం, ఎదుర్లలంక వారది వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. యానంలోని లోతుట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Updated Date - 2022-07-12T21:58:07+05:30 IST