Amaravathi/Hyderabad: అమలాపురం (Amalapuram)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లా (Konaseema District) పేరు మార్పుపై స్థానిక జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ (collectorate)ను ముట్టడించేందుకు యత్నించారు. అయితే పరిస్థితులు అదుపు తప్పాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో లాఠీ ఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకారులు స్థానిక వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. మంత్రి విశ్వరూప్ (minister viswaroop) నివాసం, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ (minister ponnada satish) ఇంటితో పాటు మరో ఇంటికి కూడా నిప్పు పెట్టారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అదనపు బలగాలతో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘‘విభజన సమయంలోనే పేరు ఎందుకు ప్రకటించలేదు?. ఆలస్యంగా ప్రకటించడానికి కారణమేంటి?. సమాజంలో కొత్త చిచ్చుకు వ్యూహం పన్నారా?. కోనసీమలో ఆగ్రహజ్వాలకు కారకులెవరు?. అంబేద్కర్ పేరుపై వ్యతిరేకత ఎందుకు?. కోనసీమ జిల్లా పేరు విషయంలో కుట్ర జరిగిందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.
ఇవి కూడా చదవండి