నిందితులపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-05-27T07:16:29+05:30 IST

అమలాపురంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ప్రస్తుతం ఈనెల 24న అల్లర్లకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. నిందితుల ను గుర్తించి వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

నిందితులపై ఉక్కుపాదం
అమలాపురంలో పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తున్న కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

  • 46 మందిపై హత్యాయత్నం కేసు.. 19 మంది అరెస్టు
  • 6 కేసుల్లో వెయ్యి మందికి పైగా నిందితులను గుర్తించిన పోలీసులు 
  • పరిస్థితులు అదుపులోనే : పోలీసులు
  • మంత్రి విశ్వరూప్‌, పొన్నాడకు ఎంపీ బోస్‌ పరామర్శ

అమలాపురం, ఆంధ్రజ్యోతి మే 26: అమలాపురంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ప్రస్తుతం ఈనెల 24న అల్లర్లకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. నిందితుల ను గుర్తించి వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వివిధ సామాజిక వర్గాలకు చెందిన యువకులను ఎక్కడికక్కడే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ల కు తరలించి విచారిస్తున్నారు. డీఐజీ పాల్‌రాజు పర్యవేక్షణలో వివిధ జిల్లాలకు చెందిన ఎస్పీలు అమలాపురంలోనే మకాంవేసి శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్‌ స్థానిక కాటన్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకోవడంతో పెద్దఎత్తున వైసీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మంత్రి విశ్వరూప్‌ ను కలిసి ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆయనతో మా ట్లాడారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగమంతా ఓవైపు అమ లాపురం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అలజడులు లేకుండా భద్రతను పటిష్టం చేయడంతోపాటు మరోవైపు కేసుల్లో ఉన్న నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులను గుర్తించి నిరసన ర్యాలీతో సంబంధం లేనప్పటికీ ఈ కేసుల్లో నిందితులుగా చేర్చడంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వజ్ర వాహనంతోపాటు పోలీసులపై రాళ్లదాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఒకటి బయటకు విడుదలైంది. ఈ కేసులో ప్రధానంగా దివంగత కాపునేత నల్లా చంద్రరావు తనయుడు నల్లా అజయ్‌, వైసీపీకి చెందిన అన్యం సాయి, అడపా సత్తిబాబుతోపాటు బీజేపీ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు, బీజేపీ నాయకులు అరిగెల వెంకటరామారావు, కొండేటి ఈశ్వర్‌గౌడ్‌ల తోపాటు జనసేన శ్రేణులపై కేసు నమోదు చేశారు. అలాగే మంత్రి విశ్వరూప్‌ రెండు ఇళ్ల దహనానికి సంబంధించి వేర్వేరుగా వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లు సిద్ధంచేసినట్టు సమా చారం. అలాగే ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇంటి దహ నానికి సంబంధించి కూడా నాన్‌బెయిల్‌బుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంపై కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ మీడియాతో మాట్లాడుతూ ఆరు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి వెయ్యి మంది నిందితుల వరకు గుర్తించినట్టు వెల్లడించారు. అల్లర్లకు పాల్పడ్డ నిందితులను వీడియో క్లిప్పింగ్‌లు, సీసీ పుటేజీల ఆధారంగా సాంకేతికపరంగా గుర్తిస్తున్నామని తెలిపారు. కాగా కాటన్‌ గెస్ట్‌హౌస్‌లో ఉన్న మంత్రి విశ్వరూప్‌ను పలువురు నాయకులు పరామర్శించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటికి కూడా భారీగా అభిమానులు, పార్టీశ్రేణులు, అధికార, అనధికారులు చేరుకుని పరామర్శిస్తున్నారు. ఓ సామాజిక వర్గానికి చెందినవారు పట్టణంలోకి వస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులకోసం పట్టణాన్ని జల్లెడ పడుతున్నారు. మళ్లీ ఆయా సామాజికవర్గాలవారు ఆందోళనకు దిగుతారనే సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమైంది. 

కుల విద్వేషాల వల్లే విధ్వంసం

మానవ హక్కుల వేదిక 

అమలాపురం టౌన్‌, మే26: అమలాపురంలో జరిగిన విధ్వంసం పూర్తిగా కుల విద్వేషాల వల్లే జరిగిందని మానవహక్కుల వేదిక నాయకులు ఆరోపించారు. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ ప్రభు త్వం ప్రకటించడంతో ఆధిపత్య, వెనుకబడిన కులాలకు చెందిన అల్లరిమూకలు ఈ దాడులు పాల్పడ్డాయని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి యేడిద రాజేష్‌, రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఏ.రవి, జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావులు ఆరో పించారు. దళితులకు వ్యతిరేకంగా దళితేతర కులాలను ఏకంచేయడంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి సంస్థల ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరును మార్చడం వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ల గృహాల దహనం పఽథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. దారుణకాండకు కారణమైన వారందరిపైన కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి, నింది తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

కేసులు..

కేసు : ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 138/2022 

సెక్షన్లు : 307, 143,144, 147, 148, 151, 152, 332, 336, 427, 188, 353 రెడ్‌విత్‌ 149 ఐపీసీ 34

ఈ కేసులో మొత్తం  నిందితులు : 46

నిందితుల పేర్లు : కాపు నేత నల్లా సూర్యచంద్రరావు తనయుడు నల్లా అజయ్‌, అన్యం సాయి, ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబు,    బీజేపీ అమలాపురం పార్లమెంటరీ కార్యదర్శి మోకా సుబ్బారావు, వడగన  నాగబాబు (సవర్పాడు), నూకల పండు (గుడాల), కురసాల నాయుడు (థింక్‌ యాడ్స్‌), థింక్‌ యాడ్స్‌ షావుకారు, దున్నాల దిలీప్‌ (కల్వకొలను వీధి), అడపా శివ, ఆశెట్టి గుడ్డు, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్‌, లింగోలు సతీష్‌, నల్లా నాయుడు (వెంకటరమణ థియేటర్‌ పైనాఫిల్‌ జ్యూస్‌ షాపు), నక్కా హరి (ఈదరపల్లి), కిషోర్‌ (విద్యానికేతన్‌ కాలేజీ ఏరియా), దొమ్మేటి బబ్లూ (నారాయణపేట), నల్లా పృఽథ్వీ (నల్లావీధి), ఇళ్ల నాగవెంకట దుర్గానాయుడు అలియాస్‌ నాగు, అడపా సత్తిబాబు (వైసీపీ ఎంపీటీసీ, ఈదరపల్లి), నల్లా రాంబాబు(స్వీట్‌షాపు ముస్లింవీధి), యాళ్ల రాధా (బెండమూర్లంక), గాలిదేవర నరసింహమూర్తి అలియాస్‌ బుల్లా (చెయ్యేరుగున్నేపల్లి), సంసాని రమేష్‌ (నారాయణపేట), కడలి విజయ్‌ (ఎస్‌కేబీఆర్‌ కాలనీ), తోట గణేష్‌ (గండువీధి), అన్యం సాయి (కల్వకొలను వీధి), దూలం సునీల్‌ (కొంకాపల్లి), కల్వకొలను సతీష్‌ (కల్వకొలనువీధి), కనిపూడి రమేష్‌ (పేరూరు వై జంక్షన్‌), ఈదరపల్లి జాంబా అలియాస్‌ తిరుమనాఽథం జాంబా, చింతపల్లి చిన్నా (ఈదరపల్లి), పోలిశెట్టి కిషోర్‌ (రౌడీషీటర్‌, ఈదరపల్లి), నల్లా కరుణ (జనుపల్లి), పాటి శ్రీను (రావులపాలెం), చిక్కం బాలాజీ (మహిపాలవీధి), పెద్దిరెడ్డి రాజా (కల్వకొలనువీధి), మద్దింశెట్టి ప్రసాద్‌(తొండవరం), వినయ్‌ అలియాస్‌ గబ్బర్‌ (కల్వకొలనువీధి), శివ (గణపతి లాడ్జి), సాధనాల మురళీ (అనపర్తి స్ర్టీట్‌), వాకపల్లి మణికంఠ (జనుపల్లి), కాశిన ఫణింద్ర (బండారులంక), కొండేటి ఈశ్వరరావు (అమలాపురం), అరిగెల తేజ (అమలాపురం), అరిగెల వెంకటరామారావు (అమలాపురం), రాయుడు స్వామి (గంగలకుర్రు) ఉన్నారు. 

Updated Date - 2022-05-27T07:16:29+05:30 IST