కోనసీమను అంబేడ్కర్‌ జిల్లాగానే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-05-26T05:53:13+05:30 IST

కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ జిల్లాగా కొనసాగించాలని బీఎస్పీ శ్రీరాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం అమలాపురంలో జరిగిన విధ్వంసాన్ని ఆయన తీ వ్రంగా ఖండించారు.

కోనసీమను అంబేడ్కర్‌ జిల్లాగానే కొనసాగించాలి
నిరసనలో దళిత సంఘాల నాయకులు

హిందూపురం టౌన, మే 25: కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌  జిల్లాగా కొనసాగించాలని బీఎస్పీ శ్రీరాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం అమలాపురంలో జరిగిన విధ్వంసాన్ని ఆయన తీ వ్రంగా ఖండించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కా ర్యకర్తలతో కలసి నిరసన తెలిపారు. దశాబ్దాలు దాటినా దేశంలో అగ్రకులాలు మారలేదన్నారు. దీనికి నిదర్శనమే అమలాపురం వి ధ్వంసమన్నారు. ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల న్నారు. గతంలో జిల్లాలు ప్రకటించినప్పుడు అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదన్నారు. అభ్యంతరాలకు 30 రోజులు గడువు ఇచ్చినా, ఏం చేశారని మండిపడ్డారు. కులాల మ ధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కు తెరదించిందన్నారు. పొట్టి శ్రీరాములు పేరు పెట్టినప్పుడు లే నిది, ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ పేరు పెట్టడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు హరికుమార్‌, మూర్తి, ఆదినారాయణ, నారాయణన, రఫీక్‌, చంద్రశేఖర్‌, పెద్దన్న, కిష్టప్ప, సుబ్బన్న, నరసింహప్ప, అంజినప్ప పాల్గొన్నారు. 


విధ్వంసానికి కారకులను అరెస్ట్‌ చేయాలి 

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంతో చెలరేగిన విధ్వంసానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని దళిత సంఘా లు మండిపడ్డాయి. బుధవారం రాత్రి హిందూపురంలోని అంబేడ్క ర్‌ సర్కిల్‌లో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్‌ స తీష్‌, బీఎస్పీ శ్రీరాములు, మోదాశివ, లైఫ్‌వరల్డ్‌ ఉదయ్‌కుమార్‌, ఎంఎ్‌సఎఫ్‌ రవి, ఆర్టీసీ బాబన్న, శ్రీరాములు, టైలర్‌ గంగాధర్‌, ఆ నంద్‌ మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే అగ్రవర్ణాలకు ఎందుకంత బాధ అన్నారు. పెద్ద దేశానికి రాజ్యాంగం ర చించిన మహోన్నత వ్యక్తి పేరు పెట్టడం ఆ జిల్లా ప్రజలు చేసుకు న్న అదృష్టంగా భావించాలన్నారు. విధ్వంసానికి కారకులైన వారిని వెంటనే అరె్‌స్టచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కా ర్యక్రమంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


మడకశిర టౌన: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడం తో వివాదం సృష్టించడం సరికాదని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన తలమర్ల సుబ్బరాయుడు ప్రకటనలో ఖండించారు. మహనీయులకు కులాలను అపాదించడం, కులవివక్షను సమాజంలో సృష్టించడం బాధాకరమన్నారు. కోనసీమ జిల్లా సాధనసమితి పేరు సృష్టించి విధ్వంసాలకు పాల్పడడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. అంబేడ్కర్‌ పేరు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-05-26T05:53:13+05:30 IST