కొండా లక్ష్మణ్‌బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

అణాగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు శ్రమించిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శమని ప్రభత్వ విప్‌ మాజీ విప్‌ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

కొండా లక్ష్మణ్‌బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శం
లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కర్నె ప్రభాకర్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి



సంస్థాన్‌ నారాయణపురం, సెప్టెంబరు 30: అణాగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు శ్రమించిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శమని ప్రభత్వ విప్‌  మాజీ విప్‌ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌నారాయణపరం మండల కేంద్రంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి వారు అవిష్కరించారు. అనంతరం ఈసందర్భంగా జరిగిగిన సభలో వారు మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణ మహానీయుల జీవితాలు, వారి త్యాగాలను భావితరాలకు అందించడం కోసమేనని వారు అన్నారు. నాడు దేశ స్వాతంత్య్రం కోసం, నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కడవరకు పోరాడిన మహానీయుడు బాపూజీ అని కొనియాడారు. రాష్ట్రంలో సహకార సంఘాల ఏర్పాటుకు బాపూజీ ఆజ్యం పోశాడని వారు తెలిపారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి వెంకటేశంగౌడ్‌, సర్పంచ్‌ చికిలంమెట్ల శ్రీహరి, మాజీ జడ్పీటీసీ బొళ్ల శివశంకర్‌నేత, సూరపల్లి శివాజీనేత, జిక్కిడి జంగారెడ్డి, దోనూరి వీరారెడ్డి, ఉప్పల లింగస్వామి, సూరపెల్లి వెంకటేశం, వంగరి రఘు, బొళ్ల విఠలయ్యనేత, జవహార్‌, వడ్డేపల్లి రాములు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST