CM KCR క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కొండా సెటైర్లు..

ABN , First Publish Date - 2022-07-18T20:02:30+05:30 IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

CM KCR క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కొండా సెటైర్లు..

Hyderabad : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నిన్న గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. గోదావరి వరదలుల చూస్తుంటే విదేశాల నుంచి క్లౌడ్‌ బరస్ట్‌(Cloud Burst) కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతోందని.. గతంలో లద్దాక్‌లో, ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి వరదలే చోటుచేసుకున్నాయని తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ క్లౌడ్ బరెస్ట్ వ్యాఖ్యలపై ప్రజలు నవ్వుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(Konda Visweswar Reddy) పేర్కొన్నారు.


క్లౌడ్ బరెస్ట్‌పై సీఎం కేసీఆర్ ఆధారాలు లేకుండా మాట్లాడారాని.. తన దగ్గర ఉన్న ఆధారాలను ఇవ్వాలని కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. క్లౌడ్ బరస్ట్‌పై కొండా పవర్ పాయింట్ ప్రజంటేషన్(Power Point Presentation) ఇచ్చారు. క్లౌడ్ బరెస్టు జరిగితే 100మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్నారు. అసలు క్లౌడ్ బరస్ట్ చేసింది పాకిస్తానా?(Pakistan) లేదంటే చైనా(China)నా? సీఎం చెప్పాలని నిలదీశారు. రాకెట్స్, విమానంతో క్లౌడ్ బరెస్ట్ చేయాలంటే.. వాళ్ళకి ఇండియా(India)లో ఒక సీక్రెట్ ఏర్ బేస్(Secret Air Base) ఉండాలని.. బహుశా ఆ ఎయిర్ బేస్ గజ్వేల్‌(Gajwel)లోనే ఉండి ఉంటుందని ఎద్దేవా చేశారు. తన కంటే ముఖ్యమంత్రికి మెదడు, లాజిక్ బాగా ఉంటుందని.. లద్దాక్‌లో క్లౌడ్ బరస్ట్ సాధ్యమేనని.. నిజంగా అక్కడ అయ్యిందా లేదా అనేది తనకు తెలియదని పేర్కొన్నారు. కాళేశ్వరంతో ఫ్లడ్ కంట్రోల్ అవుతోందన్నారని.. మరి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. రిజర్వాయర్ కట్టకుండా నీళ్లను ఎక్కడా పంప్ చేస్తారని నిలదీశారు. కొండ పోచమ్మ సాగర్ ఇప్పటి వరకూ నింపారా? అని నిలదీశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeswar Reddy) మాటలు ఖండిస్తున్నానని.. మునగని స్థానంలో మోటార్లు పెడతారు తప్ప మునిగే స్థానంలో పెడతాడా? అని కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. 


Updated Date - 2022-07-18T20:02:30+05:30 IST