
మహబూబ్‌నగర్: బీజేపీ నేత బండి సంజయ్‌ను మాజీ ఎంపీ Konda Vishweshwar Reddy కలిశారు. అంతకుముందు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో విశ్వేశ్వర్‌రెడ్డి సమావేశమయ్యారు. సంజయ్‌తో భేటీకి జితేందర్‌రెడ్డితో కలిసివచ్చారు. సంజయ్‌తో భేటీ అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తండ్రీకొడుకులను ఓడించాలని పిలుపునిచ్చారు. Bandi Sanjay వెంటే తెలంగాణ సమాజం ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటిస్తారు. నడ్డా పర్యటన నేపథ్యంలో విశ్వేశ్వర్‌రెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి