కొందుర్గు ఎస్సైని సస్పెండ్‌ చేయాలి

Sep 27 2021 @ 00:23AM
మాట్లాడుతున్న నర్సయ్య

షాద్‌నగర్‌ : భూస్వాములకు కొమ్ము కాస్తూ పేద ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కొందుర్గు ఎస్సై సీహెచ్‌ శ్రీనివా్‌సను సస్పెండ్‌ చేయాలని ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది.  కొందుర్గు మండలం రేగడి చిలుకమర్రి గ్రామంలో ఓ భూవివాదంలో ఎస్సై, మాజీ సర్పంచ్‌ విఠల్‌రెడ్డి అనే భూస్వామికి వత్తాసు పలుకుతూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం ప్రజా సంఘాల జేఏసీ నేత తుప్పుడు నర్సయ్య మాట్లాడుతూ.. ఎస్సై చేస్తున్న అన్యాయాలకు తమవద్ద సాక్ష్యాలున్నాయని తెలిపారు. మండలానికి చెందిన ఓ గ్రామ మాజీ సర్పంచ్‌ మృతిపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయనీ, దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై అన్యాయాలకు నిరసనగా ఈ నెల 29న కొందుర్గులో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జనచైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లగల రమేష్‌, ఎమ్మార్పీఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జంగయ్య, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నేత అనంతయ్య, తుప్పుడు అంజమ్మ, తదితరులు ఉన్నారు. 

Follow Us on: