Advertisement

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Dec 3 2020 @ 22:43PM
రాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

హాజీపూర్‌, డిసెంబరు 3: ధాన్యం కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ భారతి హొళికేరి పేర్కొన్నారు. గురువారం ముల్కల్లలో డీసీఎంఎస్‌, రాపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ధాన్యం కుప్పల వద్దకు వెళ్ళి తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు తాలు, తప్ప లేకుండా కేంద్రాలకు తీసుకువచ్చి మద్ద తు ధర పొందాలని సూచించారు. హాజీపూర్‌  కేంద్రం వద్ద పడ్తనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం ఆధ్వర్యంలో వడ్లను తూర్పారపట్టే యంత్రాలను కలెక్టర్‌ ప్రారంభించారు. రైతులు యంత్రాలను ఉప యోగించుకోవాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, తహసీల్దార్‌ మహ్మద్‌ జమీర్‌, ఎంపీడీఓ మహ్మద్‌ అబ్దుల్‌ హై, ఎంపీపీ స్వర్ణలత శ్రీనివాస్‌, సర్పంచ్‌లు, పీఏసీఎస్‌ చైర్మన్లు,  పాల్గొన్నారు. 


Follow Us on:
Advertisement