అలాంటి ఫీచర్ తీసుకొచ్చిన తొలి సోషల్ మీడియా వేదికగా Koo

ABN , First Publish Date - 2022-05-11T01:52:44+05:30 IST

ఇండియన్ మైక్రోబ్లాగింగ్ సైట్ కూ (Koo) సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్‌ను

అలాంటి ఫీచర్ తీసుకొచ్చిన తొలి సోషల్ మీడియా వేదికగా Koo

న్యూఢిల్లీ: ఇండియన్ మైక్రోబ్లాగింగ్ సైట్ కూ (Koo) సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్‌ను అయితే చూడాలనుకుంటామో, దానిని మాత్రమే చూసేందుకు ఈ ఫీచర్ సహకరిస్తుంది. ఇలాంటి ఫీచర్ తీసుకొచ్చిన తొలి సోషల్ మీడియా సంస్థగా కూ రికార్డులకెక్కింది. ఇందుకోసం యూజర్ అల్గారిథమ్‌ను పబ్లిక్‌గా మార్చింది.


ఫలితంగా యూజర్లు తాము చూడాలనుకుంటున్న కంటెంట్‌ను మేనేజ్ చేయగలుగుతారు. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు ఏదైనా కంటెంట్‌ను ఎందుకు చూస్తున్నారో తెలుసుకునే హక్కును పొందుతారు. ఈ అల్గారిథమ్స్‌ను కూ ఈ ఏడాది మార్చిలోనే తన వెబ్‌సైట్‌లో పెట్టింది. అల్గారిథమ్ అనేది యూజర్లు వారి ప్రాధాన్యాలకు అనుగుణంగా, వారి అనుభవాలను కస్టమైజ్ చేసుకునేందుకు ఉపయోగపడే గణిత నియమాల సమితి. 


యూజర్ల ప్రాధాన్యం ప్రకారం కంటెంట్ వారి సోషల్ మీడియా ఖాతాలో కనిపించేలా చేయడమే ఈ అల్గారిథమ్స్ ప్రాథమిక సూత్రం. ట్రెండింగ్, హ్యాష్‌ట్యాగ్స్, ఫ్రీడమ్స్, ప్రజల రాష్ట్రాలు, నోటిఫికేషన్స్ వంటి ప్రధాన వేరియబుల్స్‌ను ఈ యాప్ డిస్కస్ చేస్తుంది. కూ యాప్ ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా యూజర్లకు స్వీయ ధ్రువీకరణ ఫీచర్‌ను పరిచయం చేసింది.


ఖాతా ధ్రువీకరించబడనప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఐడీ నకిలీదా? నిజమైనదా? గుర్తించడం చాలా కష్టం. ట్విట్టర్‌లో చూసుకుంటే ప్రముఖుల ఖాతాలు మాత్రమే వెరిఫై అవుతాయి. వారి ఖాతాలకే అథెంటికేట్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ కూలో మాత్రం ఎవరికివారే ధ్రువీకరణ చేసుకునే వెసులుబాటు ఉండడం యూజర్లకు లాభించే అంశం.

Read more