చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో సస్యశ్యామలం

ABN , First Publish Date - 2021-06-17T04:46:04+05:30 IST

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో సస్యశ్యామలం

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో సస్యశ్యామలం
కమలాపూర్‌ మండలం శనిగరంలో చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి ఈశ్వర్‌

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌


కమలాపూర్‌, జూన్‌ 16: చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో గ్రామాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కమలాపూర్‌ మండలంలోని శనిగరం, అంబాల, నేరెళ్ల గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు 23 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ‘మిషన్‌ కాకతీయ’తో రాష్ట్రంలోని చెరువులను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా మిగిలిన చెరువులుంటే పనులను పూర్తి చేయిస్తామన్నారు. కాళేశ్వరం ద్వా రా శ్రీరాంసాగర్‌, ఎల్‌ఎండీ నుంచి కెనాళ్ల ద్వారా నీళ్లు ఇస్తున్నమన్నారు. కాల్వలకు అవసరమైన చోట్ల షటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో 1.20కోట్ల ఎకరాలు సాగులోకి వచ్చిందని వివరించారు. ఎత్తైన భూములకు, గోదావరి ఒడ్డున ఉన్న ఎత్తు భూములకు లిఫ్టు ఇరిగేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెక్‌డ్యామ్‌లను నిర్మించామని తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రూ.100కోట్లతో సుమారు 18 చెక్‌డ్యామ్‌లను నిర్మించామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 78,213 ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. చెక్‌డ్యామ్‌లను త్వరితగతిన పూర్తిచేయాలని, సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డాక్టర్‌ పెరియాల రవీందర్‌రావు, సింగిల్‌ విండో వైస్‌-చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌ గోపాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రదీ్‌పరెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T04:46:04+05:30 IST