‘డబుల్‌’ నిర్మాణం వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T03:34:17+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు.

‘డబుల్‌’ నిర్మాణం వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌

స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ కనకయ్య

కొత్తగూడెం అర్బన్‌, డిసెంబరు 3: డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. జడ్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరుచేసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఎందుకు పూర్తి కావడం లేదని ఐటీడీఏ రాములుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో దుమ్ము గూడెం, భద్రాచలం, ములకలపల్లి మండలాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ములక లపల్లి మండలంలోని తాళ్లపాయిలో డబుల్‌ బెడ్‌ రూం ఇ ళ్లు మంజూరై మూడేళ్లు గడుస్తున్నా, సగం పనులుచేసి వదిలేశారని స్వయంగా తనే వెళ్లి ఫోన్‌ చేసినా స్పందిం చడం లేదని ఆగ్రహించారు. ఇటీవల ఇద్దరు కరోనా సోకిన గర్భిణీలు కొత్తగూడెం ఆసుపత్రికి వచ్చినప్పటికీ వారికి ప్రసవం చేశామని కొత్తగూడెం సూపరింటెండెంట్‌ సరళ తెలిపారు. జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. వివాదాస్పదంగా ఉన్న భూములను గుర్తించి జాయింట్‌ అధికారులకు సూచించారు. 


Updated Date - 2020-12-04T03:34:17+05:30 IST