Advertisement

కొరటాల తర్వాతి సినిమా ఆ హీరోతోనా?

Oct 14 2020 @ 13:56PM

ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఆచార్య` రూపొందిస్తున్నారు. లాక్ డౌన్‌కి ముందు మొదలైన ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. త్వరలో మిగిలిన భాగం షూటింగును కూడా పూర్తి చేసి వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు.


`ఆచార్య` తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కొరటాల సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే అంతకంటే ముందు కొరటాల ఓ చిన్న సినిమా చేయబోతున్నారట. బన్నీ `పుష్ప` పూర్తి చేసేలోపు కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తారట. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో కథానాయకుడిగా నటించబోతున్నాడట. లాక్‌డౌన్ సమయంలో కొరటాల ఈ కథ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమా విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.