Advertisement

జాగ్రత్తే కరోనాకు మందు

Apr 23 2021 @ 23:28PM
పోలీసు కుటుంబాలకు కిట్లు పంపిణీ చేస్తున్న మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌

- మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 23 : జాగ్రత్తగా ఉండడమే కరోనాకు మందు అని మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం గిద్దలూరు పట్టణంలోని విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తున్నదని, రోజురోజుకు వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుందని అన్నారు. అవసరమైతే తప్ప బయట తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎస్‌సీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాల మేరకు కొవిడ్‌ నివారణ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులు మెడికల్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ యు.సుధాకర్‌రావు, కెఎ్‌సపల్లె వైద్యాధికారి డాక్టర్‌ నాయబ్‌రసూల్‌, 4 మండలాల ఎస్‌ఐలు, సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.