జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు

ABN , First Publish Date - 2021-07-24T05:59:03+05:30 IST

జిల్లా నూతన కలెక్టర్‌గా పి.కోటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు

  1. వీరపాండియన్‌ పౌరసరఫరాల ఎండీగా బదిలీ

కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 23: జిల్లా నూతన కలెక్టర్‌గా పి.కోటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న జి.వీరపాండియన్‌ పౌరసరఫరాల సంస్థ ఎండీగా బదిలీ చేసింది. వీర పాండియన్‌ జిల్లా కలెక్టర్‌గా 25 నెలల పాటు విధులు నిర్వహించారు. ఈయన స్థానంలో విశాఖపట్నం మెట్రోపాలిటిన్‌ సిటీ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న పి.కోటేశ్వరరావు నియమించింది. ఈయన 2019 జూన్‌ 24 నుంచి మెట్రోపాలిటిన్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు.  

Updated Date - 2021-07-24T05:59:03+05:30 IST