కోటిపల్లి ఇరిగేషన్‌ పరిధిలో బలహీనపడ్డ ఏటిగట్లు

ABN , First Publish Date - 2021-07-25T06:42:26+05:30 IST

కోటిపల్లి ఇరిగేషన్‌ సెక్షన్‌ పరిధిలోని కె.గంగవరం మండలంలో పలుచోట్ల ఏటిగట్లు బలహీనపడడం గోదావరికి వరదనీరు రావడంతో ప్రమాదపుశాత్తూ పొరపాటున గండికాని పడితే మూడు మండలాలకు ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కోటిపల్లి ఇరిగేషన్‌ పరిధిలో బలహీనపడ్డ ఏటిగట్లు
కె.గంగవరం మండలం కూళ్లలో ఏటిగట్టువద్ద సిద్ధం చేసిన ఇసుక సంచులు

  • మూడు మండలాలకు పొంచి ఉన్న ప్రమాదం
  • రూ.45కోట్లతో ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితం

మండపేట, జూలై 24: కోటిపల్లి ఇరిగేషన్‌ సెక్షన్‌ పరిధిలోని కె.గంగవరం మండలంలో పలుచోట్ల ఏటిగట్లు బలహీనపడడం గోదావరికి వరదనీరు రావడంతో ప్రమాదపుశాత్తూ పొరపాటున గండికాని పడితే మూడు మండలాలకు ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోటిపల్లి ఇరిగేషన్‌ సెక్షన్‌ పరిధిలోని మూడు చోట్ల ఏటిగట్లు బలహీన పడి కోతకు గురవుతున్నాయి. ఏటిగట్లు బలహీన పడినచోట గ్రోయిన్స్‌ నిర్మించడంతోపాటు గట్టు పటిష్టపరిచేందుకు ఇరిగేషన్‌ శాఖాధికారులు తయారు చేసిన రూ.45కోట్ల ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఇక వరదలు వచ్చినపుడు ఇరిగేషన్‌ అధికారులు అడపాదడపా కూళ్ల, సుందరపల్లి బలహీనపడిన గట్లవద్ద తాత్కాలికంగా ఇసుక సంచులు వేసి రక్షణ చర్యలు చేపడుతున్నారు. కూళ్లవద్ద రెండుచోట్ల మొత్తం 550 మీటర్లు మేర గట్టు కోతకు గురవుతోంది. సుందరపల్లివద్ద 350 మీటర్లు గట్టు కోతకు గురువుతోంది. ప్రస్తుతం గోదావరికి వరదనీరు రావడంతో ఇరిగేషన్‌ అధికారులు తాత్కాలికంగా రూ.25లక్షలతో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు. కూళ్ల సుందరపల్లి ప్రాంతాల్లో గోదావరి వరదల సమయంలో గట్టును తాకుతూ కోతకు గట్టు గురికావడంవల్ల ప్రమాదం జరిగితే కె.గంగవరం, రామచంద్రపురం, కాజూలూరు మండలాలకు ప్రమాదం పొంచి ఉంది.

Updated Date - 2021-07-25T06:42:26+05:30 IST