నేడే కోవ్యాక్సిన్‌ టీకా

ABN , First Publish Date - 2021-01-16T05:59:12+05:30 IST

దేశ వ్యాప్తంగా ప్రజలను ఉకిరి బిక్కిరి చేసి కొందరి ప్రాణాలను సైతం బలిగొన్న కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి వచ్చింది.

నేడే కోవ్యాక్సిన్‌ టీకా
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మొదటి విడతలో వ్యాక్సిన్‌ వైద్య సిబ్బందికే..
ఉమ్మడి జిల్లాలో 19,675 మంది వైద్య సిబ్బంది గుర్తింపు   
నేడు 10 ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సిన్‌ వేయనున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది
నిజామాబాద్‌లో 6, కామారెడ్డిలో 4 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌
మొదటి డోస్‌ తర్వాత 28 రోజులకు రెండో డోస్‌
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట చర్యలు చేపట్టిన అధికారులు
కామారెడ్డి టౌన్‌, జనవరి 15: దేశ వ్యాప్తంగా ప్రజలను ఉకిరి బిక్కిరి చేసి కొందరి ప్రాణాలను సైతం బలిగొన్న కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 10 నెల ల పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కరోనా మహ మ్మారిని తరిమేందుకు వ్యాక్సిన్‌తో కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఇందుకు అనుగుణంగా శనివారం నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ చేయాలని నిర్ణ యించగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇప్పటికే వ్యాక్సిన్‌ పంపి ణీ ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి జిల్లాలకు సైతం కో వ్యాక్సిన్‌ చేరుకోగా వాటిని ముందుగా వైద్యసిబ్బందికి వేసేం దుకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల వైద్యఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్ప టికే ఇరు జిల్లాల్లోని 19,675 మంది వైద్య సిబ్బందిని గుర్తించి తొలి విడతలో వారికి వ్యాక్సినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌, బోధ న్‌, ఆర్మూర్‌, డిచ్‌పల్లి, మోర్తాడ్‌, మాక్లూర్‌ మండ లాల్లోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ చేయను న్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి, రాజీవ్‌నగర్‌ అర్బన్‌ పీహెచ్‌సీ, సదాశివనగర్‌, భిక్కనూర్‌ పీహెచ్‌సీలలో వ్యాక్సినేషన్‌ చేయనున్నా రు. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రజాప్రతినిధులను సైతం భాగస్వా మ్యులను చేస్తూ వారిచే శనివారం ప్రారంభం చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 19,675 మంది వైద్య సిబ్బంది
భారత ప్రభుత్వం అందించే కరోనా వ్యాక్సిన్‌ కోసం ఉమ్మడి జిల్లాలో మొత్తం 19,675 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, సిబ్బందిని గుర్తించారు. ఇందులో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు 14,461 మంది ఉండగా, కామారెడ్డి జిల్లాకు చెందిన వారు 5,214 మంది ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ చేయనుండగా కామారెడ్డిలో 30, నిజామాబాద్‌ జిల్లాలో 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అయితే శనివారం మాత్రం 10 కేంద్రాల్లోనే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి టీకాలు వేయనున్నారు. నిజామాబాద్‌ జిల్లా లో 6 కేంద్రాలైన నిజామాబాద్‌ డిస్ర్టిక్‌ హాస్పిటల్‌, బోధన్‌ యూఎ్‌ఫ్‌డబ్ల్యూసీ, డిచ్‌పల్లి సీహెచ్‌సీ, మాక్లూర్‌ పీహెచ్‌సీ, మోర్తాడ్‌ సీహెచ్‌సీ, ఆర్మూర్‌ సీహెచ్‌లు ఉన్నాయి.  కామా రెడ్డి జిల్లాలో 4 కేంద్రాలైన కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి, కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీ, ఎస్‌ఎస్‌నగర్‌, భిక్కనూర్‌ పీహెచ్‌సీలలో మొదటి రోజు వ్యాక్సినేషన్‌ వేయను న్నారు. కాగా గతంలో ప్రైవేట్‌ ఆసుపత్రిలోనూ వ్యాక్సిన్‌ వే యాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ పునరాలోచన చేసి ప్రస్తుతం కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలోనే వ్యాక్సినేషన్‌ వేయా లని నిర్ణయించింది. తొలిరోజు వేసిన వ్యాక్సినేషన్‌కు అను గుణంగా ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రులలో వ్యాక్సిన్‌ ప్రక్రియపై దృష్టి సారించనుంది.
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇలా..
కొవిడ్‌ నివారణ కోసం వ్యాక్సిన్‌ వేసుకునేం దుకు కేంద్రానికి వచ్చే వారికి సంబంధించిన సెల్‌ మెసేజ్‌ను మొదటగా పరిశీలిస్తారు. అతడికి సంబంధించి ఏదైనా గుర్తింపు కార్డు, ఆధారంగా ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకున్న తర్వాత పేరును రిజిస్టర్‌ చేసి సంబంధిత వ్యాక్సినేషన్‌ గదిలోకి పంపిస్తారు. అక్కడ టీకా వేసుకున్న అనంతరం ఆయా ఆసుపత్రులలో కేటాయించిన వెయిటింగ్‌ గదులలో వైద్యుల పర్యవే క్షణలో 30నిమిషాల పాటు వేచి ఉన్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకపోతే అక్కడి నుంచి పంపించి వేస్తారు. ఒకవేళ ఏదైన సమస్యలు తలెత్తితే చికిత్స అందించేం దుకు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలను కల్పించేలా చర్య లు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద ప్రత్యేక కార్యక్ర మాలను చేపడుతున్నారు. వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీసుశాఖల ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. అడ్రస్‌ గుర్తింపు కార్డు, ఫోన్‌ నెంబర్‌, పిన్‌కోడ్‌లతో సహ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే వారి సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తోంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు కేటాయించిన సమయానికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించు కోవాలి. వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత రెండో డోసే వేసే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పి స్తారు. మొదటి వ్యాక్సిన్‌ వేసిన వారికి నాలుగు వారాల (28 రోజుల )తర్వాత రెండో డోస్‌ వేస్తారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 5,214 మంది వైద్య సిబ్బందికి మొదటి విడతలో వ్యాక్సినేషన్‌ చేయనున్నాం. ఇందులో భాగంగా 30 కేంద్రాలను గుర్తించాం. ఇప్పటికే జిల్లాకు 800 డోస్‌ల వ్యాక్సినేషన్‌ రాగా వాటిని కోల్డ్‌స్టోరేజీలో భద్రంగా ఉంచాం. శనివారం తొలిరోజు 4 కేంద్రాలలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి, రాజీవ్‌నగర్‌, భిక్కనూర్‌, సదాశివనగర్‌ పీహెచ్‌సీలలో  మాత్రమే వ్యాక్సిన్‌ వేయనున్నాం. వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారు తిరిగి 28 రోజుల తర్వాత రెండో డోస్‌ వేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ తీసుకునే వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. అడ్రస్‌ గుర్తింపు కార్డు, ఫోన్‌ నెంబర్‌, పిన్‌కోడ్‌లతో సహ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే వారి సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తోంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు కేటాయించిన సమయానికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

Updated Date - 2021-01-16T05:59:12+05:30 IST