కోవై ఎయిర్‌పోర్ట్‌లో రూ.2 కోట్ల బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-02T17:33:30+05:30 IST

కోయంబత్తూరు విమానాశ్రయంలో సింగపూర్‌ నుంచి అక్రమంగా తరలించిన రూ.2.26 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం

కోవై ఎయిర్‌పోర్ట్‌లో రూ.2 కోట్ల బంగారం స్వాధీనం

చెన్నై: కోయంబత్తూరు విమానాశ్రయంలో సింగపూర్‌ నుంచి అక్రమంగా తరలించిన రూ.2.26 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మలేసియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. సింగపూర్‌ నుంచి కోయంబత్తూరుకు బయల్దేరిన ఓ విమానంలో బంగా రాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.. సింగపూర్‌ విమానం నుంచి దిగిన ప్రయాణికుల్లో ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో వారి హ్యాండ్‌ బ్యాగులలో దాచి వుంచిన బంగారం పట్టుబడింది. దీనితో మలేసియాకు చెందిన తంగేశ్వరన్‌, నందిని అనే ఆ ఇద్దరిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-05-02T17:33:30+05:30 IST